అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక చరిత్ర ఏంటంటే..

తిరుమల మొదటి కనుమ రహదారిలో అక్కదేవతల గుడి ఉన్న విషయం భక్తులకు తెలిసిందే. ఇక్కడ ఏడుగురు అక్కదేవతలు కొలువై ఉంటారని తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ నిర్మాణ ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందాం. అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 1940 దశకంలో మొదటి కనుమ దారి నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. ఆ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. ప్రమాదాలు జరిగాయి.

ఈ తరుణంలో స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతికింద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తికావడంతో మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు సాఫీగా పూర్తయింది. 2008 నుండి అక్కగార్ల గుడిలో సంవత్సరంలో కార్తీక మాసంలో ఒక రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి మొదటి ఘాట్ రోడ్‌లోని అవ్వాచారి కోన వద్ద వెలసి ఉన్న అక్కగార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends