
గాయత్రీ జయంతిని హిందువులంతా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. చతుర్వేదాల సారాంశంగా గాయత్రీ మంత్రాన్ని భావిస్తారు. మరి గాయత్రి జయంతి నాడు పూజా విధానం ఏంటి? అంటే.. గాయత్రి జయంతి నాడు బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి.. తరువాత దేవుళ్ళకు గంగా జలంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని జపించండి. తరువాత గాయత్రీ దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
గాయత్రి మంత్రం
ఓం భూర్భువః స్వాః తత్ సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్||
గాయత్రీ మంత్రం ప్రాధాన్యత ఏంటంటే.. గాయత్రీ మంత్రాన్ని హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా గాయత్రీ జయంతి రోజున గాయత్రీ దేవిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయట. అంతేకాదు ఈ రోజున గాయత్రీ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు. తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం.
