షష్టిపూర్తి పరమార్థం ఏంటి? అసలెందుకు చేసుకోవాలి?

షష్టిపూర్తికి అనేది వ్యక్తికి 60 ఏళ్లు వచ్చిన తరువాత చేసుకునే పండుగ. ఇది ఒక వ్యక్తిగత పండుగ. మరి దీనిని మనం ఎందుకు చేసుకుంటూ ఉంటాం. అంటే మన జీవితాన్ని తరచి చూసుకునేందుకు చేసుకోవాలట. మనం చేసిన తప్పొప్పులు ఏమైనా ఉన్నాయేమో చూసుకునేందుకు చేసుకోవాలి. ఇరవై ఏళ్లు వచ్చే వరకూ బాల్య దశ. అప్పుడే జీవితం అంటే ఏటనేది కాస్త కాస్త తెలుస్తుంటుంది. ఆ తరువాత నలభై సంవత్సరాలు యవ్వనం. ఈ దశలో చదువు ముగించుకుని ఏదైనా ఉద్యోగంలో స్థిరపడి.. పెళ్లి ఆపై పిల్లలతో సంసార బాధ్యతలు వచ్చి చేరుతాయి. బాధ్యతల బరువు మోస్తూనే.. సంసార సాగరాన్ని ఈదుతూనే మనకు తెలియకుండానే యవ్వనం, కౌమరం పూర్తవుతాయి.

మొత్తానికి బాధ్యతలు బరువు దించేసుకుని కాస్త రిలాక్స్ అవుదామనుకునేసరికి అరవై ఏళ్లు వచ్చేస్తాయి. అప్పుడు షష్టిపూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో కోపతాపాలన్నింటినీ వదిలేసి, పగలు, ప్రతీకారాలు, పట్టుదలలు వదిలి అందర్నీ షష్టిపూర్తి మహోత్సవానికి ఆహ్వానిస్తారు. అన్ని తప్పులను మనం క్షమించడమే కాకుండా.. మనం చేసే తప్పులకు సైతం క్షమాపణ కోరే సమయమిది. అరవై ఏళ్ల వయసులో షష్టి పూర్తి చేసుకోవడమంటే.. జీవితాన్ని వెనుదిరిగి చూసుకోవడమేనట.. మనం వదిలేసిన కర్మలేమైనా ఉన్నాయోమనని చూసుకోవడమే. అందుకే ఈ సమయంలో ఉన్న ధనాన్ని తమ సంతానానికి ఇచ్చి మిగిలింది ఏమైనా ఉంటే.. అప్పట్లో అయితే తులా భారం తూగి ధనాన్ని పేదలకు పంచేవారట.

Share this post with your friends