సురుటుపల్లి శివుడికి ఏ అభిషేకం నిర్వహిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే..

సురుటుపల్లిలోని శివాలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ శివాలయం భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని 1344-47 మధ్య కాలంలో నిర్మించారు. విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు దీనిని నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ మేధా దక్షిణామూర్తి కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ శయన శివుడి రూపంలో ఉన్న చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.

అరుణా నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రానికి కృష్ణ పక్ష త్రయోదశి రోజు దర్శించుకుంటే చాలా మంచిదట. త్రయోదశి, శనివారం కలిసి వచ్చిన రోజున మహాప్రదోష వేళలో దేవతలు కూడా పల్లి కొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారట. ఆ రోజు దర్శనానికి వారందరి అనుగ్రహం మనపై ఉంటుందని అక్కడి వారు చెబుతారు. ఇక్కడి శివయ్యను నీలకంఠుడిగా, శ్రీ కంఠ, కృష్ణ పక్ష ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ భక్తులు స్తుతిస్తారు. ఇక్కడి శివయ్యను పంచామృతంతో అభిషేకిస్తే ఆరోగ్యప్రాప్తి, పాలతో అభిషేకిస్తే దీర్ఘాయువు, పెరుగుతో అభిషేకిస్తే సంతానం, గంధంలో అభిషేకిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతాయట. స్వామివారిని దర్శించుకుంటే వివాహ కాని వారికి వివాహ యోగం కలుగుతుందట.

Share this post with your friends