పూరి రత్నభాండాగారంలో గదుల ప్రత్యేకత ఏంటి?

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. పాములు ఉంటాయన్న భయాందోళనల నడుమ అన్ని ముందస్తు ఏర్పాట్లతో అధికారులు ఇవాళ మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. రత్నభాండాగారంలో మొత్తంగా మూడు గదులు ఉన్నాయి. వీటిలో భాగంగా మొదటి గదిని అయితే ప్రతి రోజూ తెరుస్తూనే ఉంటారు. రెండో గదిని మాత్రం కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. మొదటి గదిలో స్వామివారికి నిత్యం అలంకరించే ఆభరణాలు ఉంటాయి.

రెండో గదిలో స్వామివారికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలంకరించే ఆభరణాలు ఉంటాయి. ఇక మూడో గది అత్యంత కీలకమైన గది. దీనిని 1978లో తెరిచారు. ఆ తరువాత ఇదే తెరవడం. అంటే 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపులు తెరుచుకున్నాయి. 1978లో అయితే ఈ భాండాగారంలో సంపదను లెక్కించేందుకు 72 గంటల సమయం పట్టిందట. ఇక ఇవాళ మూడో గదిలోని సంపదనంతా పెట్టెలలో భద్ర పరిచారు. ఆ ఆభరణాలన్నింటినీ డిజిటల్ డాక్యుమెంటేషన్ చేసి అనంతరం వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేశారు.

Share this post with your friends