ఏడు వారాల నగలు ఏంటి? ఎందుకు ధరించే వారో తెలుసా?

కాలాలు మారని.. యుగాలు మారని.. బంగారం రేటు కొండెక్కే కూర్చోని.. హిందువులకు ముఖ్యంగా మహిళలకు బంగారంపై మక్కువ పెరగడమే తప్ప తరగడమనేదే ఉండదు. బంగారం అంటే చాలు ఎంత రేటు అయినా ఆలోచించరు. కొత్త డిజైన్ వచ్చిందా ఇక అంతే సంగతులు. అందుకేనేమో రేట్లు ఎంత పెరిగినా బంగారం అంత లాభసాటి వ్యాపారం ఉండదనే చెప్పాలి. అయితే మనం ఏడు వారాల నగల గురించి విన్నాం. అప్పట్లో అంటే రాజుల కాలంలో ఏడు వారాల నగలు బాగా ధరించేవారు. అవి తమ దగ్గర ఉండటం స్టేటస్ సింబల్‌గా పరిగణించేవారు.

ఇక అమ్మాయి వివాహ సమయంలో వధువుకు ఏడువారాల నగలు పెట్టేవారు. అది అత్తింటి వారైనా కావొచ్చు.. పుట్టింటి వారైనా కావడం పెట్టడం మాత్రం కామన్. అసలు ఏంటి ఏడు వారాల నగలు అంటారా? ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతి. అయితే ఇప్పటికీ కూడా గ్రహ అనుకూలత కోసం జ్యోతిష్య శాస్త్రంలో ఏ రకమైన రత్నాన్ని ధరించాలో కనుక్కుని మరీ ధరిస్తూ ఉంటాం. అప్పట్లో వారంలోని ఏడు రోజుల పాటు ఏ రోజు ఏ రత్నం ధరించాలో కనుక్కుని మరీ ధరిస్తూ ఉండేవారు. అలా ధరించడం వలన ఒంటినిండా నగలు ధరించినట్టుగానూ ఉంటుంది. గ్రహ దోషాలు ఉండవు.

Share this post with your friends