శబరిమల ఆదాయం ఈ ఏడాది ఎంతంటే..?

శబరిమలకు మాల అప్పగించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శబరిమలలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. శబరిమల వద్ద నిన్న ఫ్లై ఓవర్‌పై నుంచి దూకాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అతడు మరణించాడు. మృతుడిని కర్ణాటక రాష్టానికి చెందిన కుమారస్వామి(40)గా గుర్తించారు. సన్నిధానం నుంచి మళికప్పురం వెళ్లే ఫ్లైఓవర్ పై నుంచి కుమారస్వామి దూకేశాడు. మానసిక సమస్యల కారణంగానే అతడు మరణించినట్టు అంతా చెబుతున్నారు.

శబరిమల ఆదాయం గతేడాది కంటే భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయంలో రూ.141.13 కోట్ల ఆదాయం రాగా.. ఈ సీజన్‌లో 29 రోజుల్లోనే 163.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఈ ఏడాది గతంతో పోలిస్తే ఇప్పటికే రూ. 22 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. అరవణ(ప్రసాదం) విక్రయం ద్వారా కూడా ఎక్కువ ఆదాయం వస్తోంది. 80 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే అరవణ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే కూడా రూ.8 కోట్లకు పైగానే వచ్చాయి. భక్తుల సంఖ్య సైతం గతేడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ఈ సీజన్‌లో 29 రోజుల్లో 22 లక్షల మందికి పైగా భక్తులు రాగా, గతేడాది ఇది దాదాపు 18 లక్షలు మంది భక్తులు వచ్చారు.

Share this post with your friends