దరిద్రమంటే ఏమిటి? కేవలం ధనం లేకపోవడమేనా?

దరిద్రమంటే ఏమిటి? కేవలం ధనం లేకపోవడమేనా? మరొకటి ఏమైనా ఉందా అంటే.. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్న దానితో తృప్తి లేకుండా ఉండడమే దరిద్రమని పండితులు చెబుతారు. పైకి ధనం లేనట్టు కనబడినా కూడా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్నిఆచరించి నిత్యతృప్తుడని కుచేలుడు కొనియాడబడ్డాడు. స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కానే కాడు.. పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడిగా కీర్తించబడతాడు.

అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కుల దేవతను, స్వధర్మాన్ని, వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రవర్తింపచేసిన రావణాది రాక్షసులు, కంసకౌరవాదుల వలె పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు. భగవత్ అనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కుల దేవతారాధనం, స్వధర్మ పాలనం, ఆచార సంప్రదాయాలను పాటించడం గురుపాద సేవనం ఇవే ఐశ్వర్యమంటే.. తద్వ్యతిరిక్తమే దారిద్ర్యమని చెబుతారు.

Share this post with your friends