
శరీరమనే హార్డ్‌వేర్‌లో, మనసే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్‌వేర్‌లో యాంటీ వైరస్‌ని ఎక్కించడమే – జపం, ధ్యానం. జపం అంటే ఏమిటో తెలుసుకుందాం. జపం అంటే దైవంతో సంభాషణ ఇది మనసుకు అత్యంత ప్రశాంతతను ఇస్తుంది. భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కురిపిస్తుంది. మన ఆలోచన తరంగాలను నిశ్చలంగా చేసి, లోపల చేతన స్పృహను విస్తరింపజేస్తుంది. ప్రారంభంలో కాస్త కష్టమైనా, అలవాటు పెరిగేకొద్దీ గాఢ ధ్యాన స్థితి కి ఈ జపం మనని తీసుకెళ్తుంది.ఆ సమయంలో మనసుకే కాదు, శరీరానికీ లోతైన విశ్రాంతి లభిస్తుంది.
శాస్త్రజ్ఞుల పరిశోధన ఏమంటుంది?
మన మెదడులోని నాలుగు ముఖ్య భాగాల్లో జపం – ధ్యానం చేసే సమయంలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అవి:
ఫ్రంటల్ లోబ్
ప్రణాళికలు, భావోద్వేగాలు, చైతన్యానికి కారణమైన భాగం.
జపం – ధ్యానం చేస్తే ఇది నిశ్చలమై, మనసు తేలికపడుతుంది.
పెరైటల్ లోబ్
మన చుట్టుపక్కల విషయాలను గ్రహించేది.
జపం, ధ్యానంలో ఇది ప్రశాంతమవడంతో, మానసిక భారాలు తగ్గిపోతాయి.
థాలమస్
ఒకే విషయంపై దృష్టిని నిలిపేది.
జపం మరియు ధ్యానంలో ఆలోచనల ప్రవాహం నెమ్మదించి, మనసు ఏకాగ్రతతో నిండి ప్రశాంతమవుతుంది.
రెటిక్యులార్ ఫార్మేషన్
శరీర భాగాల నుంచి మెదడుకు హెచ్చరికల సంకేతాలు పంపేది.
జపం, ధ్యానం చేసే సమయంలో ఇవి నిలిచిపోవడంతో మెదడు సంపూర్ణ విశ్రాంతి పొందుతుంది.
మొత్తంగా చెప్పాలంటే.. శరీరమనే హార్డ్‌వేర్‌లో, మనసే సాఫ్ట్వేర్. దాంట్లోకి యాంటీ వైరస్ ఎక్కించడమే జపం!
