ఆదిపర్వంలో ఏముంటుంది? కురుక్షేత్రానికి బీజం అక్కడేనా?

మహాభారతంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది కురుక్షేత్ర యుద్ధం గురుంచే.. దీనిపై దాదాపు నలభై లక్షల మంది పాల్గొన్నారు. చివరకు మిగిలింది మాత్రం పాండవులు ఐదుగురు.. ముగ్గురు కౌరవులు. మరి ఇంతటి విధ్వంసానికి కారణమైన యుద్ధానికి బీజం ఎక్కడ పడిందో తెలుసా? ఆదిపర్వంలో జరిగిన కొన్ని సంఘటనలే ఈ యుద్ధానికి మూలమట. అవేంటో చూద్దాం. భీముని బలాన్ని సహించలేక దుర్యోధనుడు అతడిని చంపేందుకు యత్నించడం.. అర్జునుడు విలువిద్యలో అత్యంత పరాక్రముడిగా ఎదగడాన్ని సహించలేక కర్ణుడిని అంగరాజుగా ధుర్యోధనుడు ప్రకటించడం…

దుర్యోధనుడు.. ధృతరాష్ట్రుడు, శకుని, కర్ణుడు వంటి వారి అండతో పాండవులను ఇబ్బంది పెటట్డం.. లాక్షాగృహ దహనానికి యత్నించుట వంటి వాటితో పాటు పాండవులు హస్తినాపురంలోనే ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని భావించి దుర్యోధనుడు తండ్రిని ప్రేరేపించి వారిని ఇంద్రప్రస్థానికి పంపించటం. ఇలాంటి కారణాలన్నీ కురుక్షేత్ర సంగ్రామానికి దారితీశాయట. ఇవన్నీ మనకు ఆదిపర్వంలోనే కనిపిస్తాయి. భీముడు – దుర్యోధనుడు, కర్ణుడు – అర్జనుడి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలే కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణమని అంటారు. వీటితో పాటు మరికొన్ని అంశాలు.. శ్రీకృష్ణునితో మైత్రి వంటివన్నీ మనకు ఆదిపర్వంలోనే కనిపిస్తాయి.

Share this post with your friends