ఉగాది నాడు ఏం చేస్తే మంచిది? ఏం చేయకూడదు?

తేదీన తెలుగు వారంతా ఉగాది పండుగను జరుపుకోనున్నాయి. ఈ ఉగాది పండుగ గురించి కొన్ని విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పండుగ నాడు ఏం చేస్తే మంచిది? ఏం చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం చేయడం అనవాయితి. అయితే ఈ రోజున పంచాంగం దానం చేసి దక్షిణ ఇస్తే మంచిదట. అలాగే ఈ పండుగకు కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేస్తారు. అయితే అని కాసుకోలేని వారు ఈ రోజున కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుండల. పూర్వం రోజుల్లో అయితే విసన కర్రను కొనేవారు.

తైలంలో లక్ష్మి దేవి ఉంటుంది. కాబట్టి ఈ రోజు అభ్యంగన స్నానం చేస్తే చక్కటి పలితం ఉంటుంది. ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుంది . ఇక చేయకూడని పనులు.. ఉగాది పండుగ నాడు ఎవరితోనూ తర్కాలు, గొడవలు చేయకూడదు. మాసిన బట్టలు వేసుకోవడు వంటివి చేయకూడదు. పంచాంగ శ్రవణం చేసే ఆవుడు దక్షిణం వైపు కూర్చోకూడదు. పొగాకు, మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఆర్థిక నష్టానికి దారితీస్తుందని పండితులు అంటుంటారు.

Share this post with your friends