సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా వాడేదేంటంటే..

సంక్రాంతి పండుగను దేశమంతా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చేసుకుంటారు. ఆంధ్రాలో అన్ని పండుగల కంటే కూడా సంక్రాంతినే పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా ఈ పండుగకు ఏపీకి చేరుకుంటారు. కోళ్ల పందేలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. వీటిని చూసేందుకు ఇతర రాష్ట్రాల వారు సైతం ఏపీకి వెళతారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రకరకాల పిండి వంటలతో పాటు గాలి పటాలు ఎగురవేస్తారు. దాదాపు వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ పిల్లలు పెద్దలు పోటీలు పడి మరీ గాలిపటాలు ఎగురవేస్తారు.

అయితే సంక్రాంతి పండుగ నాడు పెద్ద ఎత్తున పిండి వంటలు చేస్తారు. అయితే ఈ పండుగ సమయంలో ప్రతి ఒక్క పిండి వంటలోనూ నువ్వులను ఎక్కువగా వాడుతారు.అంతేకాకుండా నువ్వుల నూనెతోనే స్నానం చేస్తారు. అభ్యంగ స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను ముందుగా శరీరానికి రాస్తారు. ఆ తరువాత నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తారు. అయితే మకర సంక్రాంతికి నువ్వులకు మధ్య పురాణాల ప్రకారం ఉన్న సంబంధం ఉందని చెబుతారు. అందుకే పిండి వంటలతో పాటు స్నానానికి కూడా నువ్వుల నూనెను వాడతారు.

Share this post with your friends