గతంలో అయితే పట్టీలు, మాత్రమే వెండివి వాడేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. నగలు కూడా వెండివే వాడటం ట్రెండ్ అయిపోయింది. బంగారం ధర బాగా ఎక్కువై పోవడం కారణమో లేదంటే ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్స్ కారణమో కానీ వెండి నగలు ట్రెండ్ అయిపోయాయి. అయితే వెండి వస్తువులు ఎవరు పడితే వారు ధరించవచ్చా? అనేది తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వెండి చంద్రునికి సంబంధించినది. కాబట్టి వెండితో చేసిన ఆభరణాలు ధరించడం వలన మనసు, మెదడు బలపడుతుందట.
ముఖ్యంగా జాతకంలో చంద్ర దోషం ఉన్న వారు ధరిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయట. ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. అయితే అందరూ ఈ వెండి వస్తువనులను ధరించకూడదట. కొంత మందికి వెండి ఆభరణాలు ధరించడం వలన మంచి కంటే నష్టాలు కూడా ఉన్నాయి. అలాంటి వారు వెండిని ధరిస్తే కొన్ని గ్రహాలు, రాశుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అప్పుడు ప్రయోజనాల మాటేమో కానీ లేనిపోని కష్టాలు తలెత్తుతాయట. కాబట్టి కొందరు వెండి ఆభరణాలను ధరించకపోవడమే ఉత్తమమట.