కలలో ఇవి కనిపిస్తే ఏం జరుగుతుందంటే..

ఎవరైనా సరే.. తెల్లవారుజామున వచ్చే కలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు తప్పక జరుగుతాయని అంటారు. మరీ ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే కొన్ని కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ ముహూర్తాన వచ్చే కలలో దేవతలు, పవిత్ర నదులు, లేత ఆకులు, పాలు లేదా కాంతివంతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తే అవి అదృష్టాన్ని, సిరిసంపదను, మంచి ఫలితాలను సూచిస్తాయట. అంతేకాకుండా కలలో నీటి బిందె కనిపిస్తే జీవితంలోే సంతోషం, శ్రేయస్సు వస్తుందని నమ్మకం. అందుకే నీటి బిందె కనిపించడం చాలా మంచిదని భావిస్తారు.అది శుభవార్తను కూడా అందించడంతో పాటు ఆర్థికంగానూ కలిసి వచ్చేలా చేస్తుందట.

కలలో నది కనిపించినా చాలా మంచిదట. ప్రవాహానికి చిహ్నమైన నది కలలో కనిపిస్తే మీ జీవితం కూడా సజావుగా సాగుతుందని.. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయని అర్థం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనడానికి దీనిని సూచికగా పేర్కొంటారు. కలలో సమృద్ధికి చిహ్నమైన ధాన్యం రాశి కనిపించినా చాలా మంచిదట. ఆర్థిక కష్టాలన్నీ తీరబోతున్నాయనడానికి చిహ్నమట. మీ కలలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపం కనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థమట. దీపం కనిపిస్తే మీలో ఉన్న భయం తొలగిపోతుందట. మొత్తంగా ఇవన్నీ బ్రహ్మ ముహూర్తంలో వస్తే చాలా మంచిదని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే కల రాగానే ఏదో జరిగిపోదు. కేవలం కష్టమే మనల్ని నిలబెడుతుంది. ఇవన్నీ పాజిటివ్ వైబ్ ఇస్తాయంతే.

Share this post with your friends