హిందూ పండుగలలో దసరా పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలూ నిర్వహించుకుంటాయి. పండుగ నిర్వహించే పద్ధతి మారవచ్చేమో కానీ జరుపుకోవడం మాత్రం పక్కా. ఇక దసరా మండుగను మధ్యాహ్నం వేళ నిర్వహించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దసరా రోజున ఈశాన్య మూలలో తామర రేకులను ఉంచి, అష్ఠదళాల మధ్యలో అపరాజితాయ నమః అనే మంత్రాన్ని పఠించి దుర్గా మాతను, శ్రీరాముడిని పూజించడం ఆనవాయితీ. అనంతరం అమ్మవారికి కుంకుమ లేదా ఎరుపు రంగు, అక్షింతలు, పువ్వులు నైవేద్యంగా పెట్టి భోగాన్ని సమర్పిస్తారు.
ఇక దసరా పండుగ రోజున పాలపిట్టను చూసే చాలా మంచిదని అంటారు. అది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. పురుషులైతే మన్యానికి వెళ్లి మరీ పాలపిట్టను చూసి వస్తుంటారు. అసలు పాలపిట్టను దర్శించుకుంటే ఏం జరుగుుతంది? అంటే మనం చేపట్టే పనిలో తప్పక విజయం లభిస్తుందట. పాలపిట్ట చూడముచ్చటగా ఉంటుంది. నీలం, పసుపు రంగుల కలయికతో అందంగా కనిపిస్తుంది. అలాంటి పాలపిట్టను దర్శించుకుంటే మనకు ప్రతి పనిలోనూ సక్సెస్ లభిస్తుందట. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు.