వినాయకుడికి దర్భను సమర్పిస్తే ఏం జరుగుతుంది?

మరికొన్ని గంటల్లో దేశమంతా వినాయక చవితిని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. పదవ రోజున అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం చేస్తారు. పది రోజుల పాటు పూజ చేసిన అనంతరం వినాయకుడిని తల్లి గంగమ్మ ఒడికి చేర్చుతారు. ఇక వినాయక చవితి నాడు 21 రకాల పత్రితో పాటు పువ్వులు, పండ్లు సమర్పించి వినాయకుడికి పూజ చేస్తారు. వినాయకుడి పూజలో ముఖ్యమైనది దర్భ. ఇది లేనిదే పూజ సంపూర్ణం కాదు. అసలు దర్భ ప్రత్యేకత ఏంటి? దర్భలతో స్వామివారిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దర్భలతో స్వామివారిని పూజిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.

విఘ్నాలను తొలగించే వాడిగా గణేషుడికి పేరు. అలాంటి వినాయకుడికి దర్భలను సమర్పించడం వల్ల అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి అనుకున్న పనులు చక్కగా పూర్తవుతాయట. దర్భ గడ్డి చాలా పవిత్రమైనదని అంటారు కాబట్టి వీటిని వినాయకుడికి సమర్పించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయట. పైగా గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి దర్భలను సమర్పించడం సులభమైన మార్గమని కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా దర్భ అనేది గణేశుడి పట్ల గౌరవం, ప్రేమకు చిహ్నంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. కనుక గణపతి పూజలో దర్భను వాడితే మనం అనుకున్నది పక్కాగా నెరవేరుతుందట.

Share this post with your friends