హనుమ మంత్రోచ్ఛారణ, ఆంజనేయ దడంకం పఠిస్తే ఏం జరుగుతుందంటే..

సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకెళ్లిన అనంతరం రాముడి బాధను తొలగించేందుకు హనుమంతుడు లంకకు వెళ్లి బీభత్సం సృష్టించాడు. లంకను దహనం చేసి రాక్షసులను మట్టుబెట్టాడు. అందుకే ఆంజనేయస్వామిని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని నమ్మకం. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత హనుమాన్ మంత్రం పఠిస్తే మనోబలం, ధైర్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా మనలో వృద్ధి చెందుతాయట. పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ‘ఓం పవన సుత హనుమాన్ కీ జై’ అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు ఉచ్చరించాలి.

అలాగే ఆంజనేయ దండకం పఠించినా కూడా చాలా మంచిదట. ప్రతి నిత్యం సంధ్యా సమయంలో పఠిస్తే ఆంజనేయ దండకాన్ని పఠించాలట. అప్పుడు కానీ మొండి రోగాలు, దుష్ట శక్తులు, పీడలు కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఆంజనేయ దండకంలో ఆంజనేయస్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఉంటాయి. ఇందులో సంస్కృత పదాలు ఉచ్చరించడం మనలో అనుకోని శక్తులు పెరుగుతాయి. దీని వల్ల శబ్దశక్తి, మంత్రశక్తితో సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకం. ఈ దండకం నిత్యం పారాయణం చేస్తే కోర్కెలు తీరుతాయని విశ్వాసం. అలాగే నిత్యం మనుమాన్ చాలీసా పారాయణం చేస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయట.

Share this post with your friends