మరో నాలుగు రోజుల్లో మనం వినాయక చవితిని జరుపుకోబోతున్నాం. ఇప్పటికే పండగకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ వినాయక మండపాలు సిద్ధమవుతున్నాయి. వినాయక చవితిని పండుగ రోజు నుంచి పది రోజుల పాటు జరుపుకోనున్నాం. అయితే ఈ 10 రోజుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే మంచిదని కొందరు భావిస్తారు. అసలు వినాయకుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కలలో వినాయకుడు కనిపిస్తే ఆ వ్యక్తి ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరుగుతుందట. అలాగే కలలో వినాయకుడు ఎలుకపై స్వారీ చేస్తూ కనిపిస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుందట.
ఎలుకపై వస్తూ కనిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యక్తి ఇంట సంతోషం, వఆంతి నెలకొంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చాలా సార్లు కలలు వస్తాయి. ఇలా తెల్లవారుజామున కల వస్తే అది తప్పక నిజమవుతుందని అంటారు. అలా బ్రహ్మ ముహూర్తంలో విఘ్నేశ్వరుడు కనిపిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఆకస్మిక ధన లాభం, కెరీర్ పరంగా వృద్ధి వంటివి ఉంటాయట. ఇక కలలో వినాయకుడిని పూజిస్తున్నట్లు కనిపిస్తే మన కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్ధమట. అంతేకాకుండా గణేషుని కృపతో జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తామట.