పార్వతీదేవికి శివుడు కథ చెబుతుండగా ఏం జరిగిందంటే..

మొత్తానికి సత్యనారాయణ స్వామివారి వ్రత కథను పార్వతీ మాత తొలుత విన్నదని తెలుసుకున్నాం. అమర్‌నాథ్ గుహాలో పరమేశ్వరుడే పార్వతీ మాతకు సత్యనారాయణ స్వామివారి వ్రత కథను వినిపించారట. అయితే ఈ వ్రత కథను స్వామివారు చెబుతున్న సమయంలో గుహలో పక్షి గుడ్డు ఉందట. శివుడు సత్యనారాయణ వ్రత కథ మొదలు పెట్టగానే గుడ్డు అండంగా మారిందట. అనంతరం దానిలో జీవం ఊపిరి పోసుకోవడం ప్రారంభించిందట. ఆ సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయట. ఆ గాలుల ప్రభావానికి గుడ్డు ఎగిరిపోయిందట.

అలా గుడ్డు గాలిలో ఎగిరి గంగోత్రి సమీపంలోని కృష్ణ ద్వైపాయన వ్యాస్ ఆశ్రమానికి చేరుకుంది. అప్పుడు అక్కడ వ్యాసుడు తపస్సు చేస్తున్నాడట. ఆయన భార్య మాతా వితిక కూడా ఆ పూజలో కూర్చొందట. ఆమె మంత్రం చదివేందుకని నోరు తెరవగా ఆ గుడ్డు ఆమె నోటిలోకి వెళ్లి కడుపులోకి చేరిందట. 12 నెలల పాటు ఆ గుడ్డు మాతా వితిక గర్భంలో ఉన్న అనంతరం శుక్ర దేవుడు జన్మించాడట. అలా శ్రీమద్ భగవత్ కథకి శుక్రుడు మొదటి ప్రతినిధి అయ్యాడని చెబుతారు. సత్యనారాయణ స్వామికి సంబంధించి ఇంట్లో వ్రతం ఆచరిస్తున్నప్పుడు పూజారి ఐదు కథలను వివరిస్తూ ఉంటారు. స్వామివారి కథను వింటే మృత్యుభయం తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం.

Share this post with your friends