స్వాతంత్ర్యానికి పూర్వం ఆదివారం నాడు భారతీయులు కొన్ని పనులు చేసేవారు కాదని తెలుసుకున్నాం కదా. మన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసేందుకు ఆదివారం సెలవు దినంగా బ్రిటిష్ వారు ప్రకటించారు. ఆపై భారతీయుల మనసులో పాశ్చాత్య సంస్కృతిని నాటడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం మాంసాహారం తినే అలవాటు చేయించి భారతీయులు నెమ్మదిగా తమ సాంప్రదాయాలను మరచిపోయేలా చేయాలని భ్రిటీష్ వారు భావించారు. అసలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నాన్ వెజ్ తినవచ్చో లేదో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం పూజకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున పవిత్రంగా పూజించడం వల్ల శరీర శుద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి. మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదని చెప్పడం జరిగింది. శరీరానికి ప్రతిరోజూ సూర్యుడు శక్తినిస్తాడు. కాబట్టి ఆదివారం రోజు పూజలు, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతోంది. ఈ రోజున కఠినమైన ఆహారం తీసుకోవడం మాంసాహారం తినడం అనేక ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు. ఆదివారాన్ని పవిత్రంగా పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొందవచ్చని జ్యతిష్యశాస్త్రం చెబుతోంది.