ప్రతి కలకూ ఓ అర్థం ఉంటుందని చెబుతారు. కలలు భవిష్యత్‌లో జరుగనున్న సంఘటనలకు నిదర్శనాలని చెబుతారు. ప్రతి కలకూ స్వప్న శాస్త్రం అర్థాన్ని చెబుతుంది. మనకు కలలో కొన్ని సార్లు బంగారు ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే అర్థమేంటి? అసలు మంచా.. చెడా? తెలుసుకుందాం.
కలలో బంగారు ఆభరణాలు కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. నగలు మన ఒంటిపై ఉన్నట్టుగా కల వచ్చినా.. లేదంటే నేలపై పడి ఉన్నట్టుగా కల కన్నా దానికి ఏదో ఒక అర్థం ఉందట. అవేంటో తెలుసుకుందాం. నేలపై పడి ఉన్న బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే.. జీవితంలో రానున్న ఆర్థిక కష్టాలకు సూచన కావచ్చట.
కుటుంబంలో ఆర్థిక పతనాన్ని కూడా ఈ కల సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి కల వస్తే జాగ్రత్తగా ఉండాలట.అలాగే బంగారు నగలు కొంటున్నట్లు కలగంటే అది శుభసూచికమని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల జీవితంలో గొప్ప విజయానికి సంకేతమని చెబుతారు. బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు కల వస్తే అశుభానికి సంకేతమట. ఇలాంటి కలలు వస్తే మీ ఆత్మీయుల అనారోగ్యానికి కారణమట. చెడు వార్తలు వినే అవకాశం రావొచ్చట. బంగారు నగలు చోరీ చేస్తున్నట్టు కల వచ్చినా అది అశుభమేనట. తీవ్ర నష్టాల పాలు కావొచ్చట. బంగారాన్ని బహుమతి ఇస్తున్నట్టుగా కల వస్తే మంచిదేనట. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అది శుభానికి సంకేతమట.