
కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఆఐనా మహల్ అంటారు. దీనిని 36 స్థంభాలతో అద్భుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం, అంతరాళం, గర్భగృహం ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు.
ధ్వజస్తంభ మండపం : డవ గోపురమైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాలతో నిర్మిచిన మండపంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాలపై వివిద దేవతామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాలను తెలిపే అనేక శిల్పాలు పొందుపరిచారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. జస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
వసంత మండపం : తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.
