ఉత్తరాఖండ్‌లోని జాగేశ్వర్ ధామ్ గురించి తెలుసుకున్నాం కదా. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకునే వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్మకం. కుబేర ఆలయంలో భక్తులు బంగారు, వెండి నాణేలను తెచ్చి ఇస్తుంటారు. కుబేరుని దర్శించుకునే సమయంలో వెండి, బంగారు నాణేలను పూజిస్తారు. అనంతరం ఒక పసుపు వస్త్రంలో ఆ నాణేలను కట్టి ఇంటికి తీసుకువెళతారు. ఇవి ఇంటికి తీసుకెళితే చాలు.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే ఉండవట. ఈ ఆలయానికి వెళ్లడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం.
కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్లీ ఆలయానికి వెళతారు. కుబేరుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలా నిత్యం ఆలయాన్ని పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూనే ఉంటారు. జాగేశ్వర్ కుబేర మందిరాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. కుబేరుని ఆశీర్వాదంతో పేదరికం నుంచి విముక్తి పొంది, సంపద, కీర్తి లభిస్తాయని విశ్వాసం. ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో కూడా తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి కత్గోడం వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి వెళ్లవచ్చు.