పేదవాడి బాధను విన్న సన్యాసి ఏం చెప్పాడంటే..

ఒక పేదవాడికి ఒక్క రూపాయికే దొరికిన అద్భుత దీపం కథ గురించి కొంత తెలుసుకున్నాం కదా. భూతానికి పని చెప్పకుంటే అది ఇచ్చినవన్నీ తీసేసుకుంటుంది. ఆ వ్యక్తి ఎంతవరకని చెప్పగలడు? చెప్పి చెప్పి విసిగిపోయాడు. ఇకపై చెప్పకుంటే సంపదలన్నీ పోతాయి. దీంతో ఒక వృద్ధ సన్యాసి వద్దకు వెళ్లి తన సమస్య చెప్పి పరిష్కారం అడిగాడు. సన్యాసి అతనికి మార్గం చూపించాడు. వెంటనే ఇంటికి వెళ్లి, భూతాన్ని పిలిచి.. “భూమిలో ఒక గొయ్యి తీయి” అని చెప్పాడు. భూతం క్షణాల్లో పెద్ద గొయ్యి తీయింది. ఆ తరువాత పెద్ద స్తంభాన్ని చూపించి దానిని ఆ గోతిలో పెట్టమని చెప్పాడు.

ఆ తర్వాత.. “ఇప్పుడు ఆ స్థంభం మీదకి ఎక్కి దిగుతూ ఉండు. నేను మరో పని చెప్పేవరకూ నీకు ఇదే పని అని చెప్పాడు. భూతం స్థంభం మీద ఎక్కుతూ దిగుతూ పనిలో పడిపోయింది. పేదవాడు తన పని చేసుకుంటూ, పొరుగువారికి సహాయం చేస్తూ సుఖంగా జీవించాడు. ఒక రోజు తిరిగి వెళ్లి చూసాడు – భూతం అలసిపోయి స్థంభం పక్కనే నిద్రపోతోంది. అది చూసి సంతోషంగా తన విజయగాధను ఆ సన్యాసికి చెప్పాడు. ఈ కథలో నీతి ఏంటంటే.. భూతం అంటే మన మనసు. ఎప్పుడూ ఆలోచనలతో పరిగెడుతూ.. కోరికలతో విసుగు పెడుతుంది. ఇక్కడితో కథ ముగియలేదు… అసలు కథ ఇప్పుడే మొదలైంది. అదేంటో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends