ధర్మరాజును పొగడటాన్ని విన్న ముంగీస ఏం చేసింది?

మహా భారతంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి. ప్రతి కథా మన జీవితానికి ముఖ్యమైన ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. వాటిలో ఒకటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తరువాత, జరిగిన బంధు వధకు పరిహారంగా ఒక యాగం చేయ తలపెడతాడు ధర్మ రాజు. ఎంతో వైభవంగా దానాలు, ధర్మాలు చేస్తాడు. వచ్చిన వారంతా ధర్మరాజు, దాన గుణాలను ఎంతో పొగుడుతారు, ఇలా పొగుడుతున్న సమయములో, ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది. దాని శరీరం సగం బంగారంతో మెరిసి పోతోంది.

వీరందరి మాటలు విన్న ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది. అది చూసి అక్కడున్న పెద్దలు, ‘నీ నవ్వుకు కారణం ఏమిటి?’ అని అడుగుతారు. అప్పుడు ఆ ముంగీస తను ఎందుకు నవ్వుతోందన్న విషయాన్ని తెలియజేస్తుంది. ‘‘మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు. ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు. కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దానధర్మాలు సరిరావు’’ అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెబుతుంది. ఇంతకీ ఆ బ్రాహ్మణుడెవరో తర్వాతి కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends