నరక సంహారం అనంతరం శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే..

నరకాసుర వధ ఎక్కడ జరిగింతో తెలుసుకున్నాం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో సంహరించాడని చెప్పుకున్నాం. ఆ సమయంలో ఈ గ్రామాన్ని నరకొత్తూరు అని పిలిచేవారట. కాలక్రమంలో అది నరకదూరుగా మారిపోయిందట. నరక సంహారానికి గుర్తుగా ఇప్పటికీ ఇక్కడ నరకచతుర్దశి నాడు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున దీపావళి పండుగను ప్రజలంతా జరుపుకుంటారు. బాణసంచాను కాల్చి ఆనందంగా గడుపుతారు.

నరక సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై అక్కడ వెలిసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ పాటలీ పుష్పాలను కన్నయ్య ఎక్కడి నుంచి తెచ్చాడో తెలుసా? దేవవనం నుంచి తెచ్చాడట. అలాగే పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ కృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల ప్రతిమలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉండటం విశేషం. నడికుదురు వెళ్లిన వారు తప్పక లక్ష్మీనారాయణులను దర్శించుకుని వస్తారు.

Share this post with your friends