సంకట మోచనుడు, బజరంగ బలిగా పిలుచుకునే హనుమంతుడిని ఆరాధించడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్మకం. మన ఇంట్లో హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టుకున్నా కూడా మంచిదని మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇంటి ముందు కూడా హనుమంతుని విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఈ ఏడాదిని పాలించే గ్రహం కుజ గ్రహమట. ఈ అంగారకునికి హనుమంతుడు అధిపతి. కాబట్టి ఈ ఏడాది హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకు బజరంగబలి విగ్రహాన్ని లేదంటే చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదట. అసలు ఇంట్లో ఏ రకమైన హనుమంతుడి విగ్రహం ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
పంచముఖి హనుమంతుడు: 2025 సంవత్సరంలో పంచముఖి హనుమంతుడి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం వద్దనో.. ఈశాన్య దిశలోనో ఉంచడం శుభప్రదమని అంటారు. ఇలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదట.
గాలిలో ఎగిరే హనుమంతుడు: ఎగిరే మనుమంతుడిని ఇంటికి దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫోటో హనుమంతుడి భుజాలపై రాముడు ఉన్నట్లు ఉంటే 2025 సంవత్సరంలో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
జెండా పట్టుకున్న హనుమంతుడు: జెండా పట్టుకున్న హనుమంతుడిని ఇంటి పడమర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. మీ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
మహాబలి వీర హనుమంతుడు: హనుమంతుడు వీరోచిత భంగిమలో నిలబడి, చేతిలో గద్ద పట్టుకొని ఉన్న చిత్ర పటాన్ని ఇంటి దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ దిశలో ఉంచితే ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే కాదు ధైర్యం కూడా పెరుగుతుంది.
సంజీవని పర్వతం తెస్తున్న హనుమంతుడు: ఈ హనుమంతుడి చిత్ర పటం ఇంట్లో ఉంటే దీర్ఘకాలిక సమస్యలన్నీ దూరమవుతాయట. హనుమంతుడి చిత్ర పటాన్ని 2025వ సంవత్సరంలో ఇంటి ఈశాన్య దిశలో ఉంటే ఆశీర్వాదం లభించడంతో పాటు వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
కూర్చున్న భంగిమలో హనుమంతుడు: కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉన్న హనుమంతుడిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకుంటే కోపం అదుపులో ఉండటంతో పాటు ఇంటి నుంచి నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.