హిందూ పురాణాల ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలిగిన మాఘ పూర్ణిమ రోజున భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగి అష్టైశ్వర్యాల సిద్ధి కలుగుతుందని చెబుతారు. పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పించిన అనంతరం పూజా కైంకర్యాలను నిర్వహించాలి. ఈ రోజున నదీస్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెబుతారు. మాఘ పూర్ణిమ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. మాఘ పౌర్ణమి రోజున మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో జీవహింస చేయరాదు.
ఇనుప వస్తువులు, నల్లని బట్టలు, వెండి, పాలు, ఉప్పు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఇలా చేస్తే శని, చంద్ర దోషాలు వస్తాయి. అలాగే ఇవాళ మనం చేసుకునే వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. వీలైనంత వరకూ మీ భోజనం మీరే వండుకోండి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులను మోసగించడం, దూషించడం, శారీరకంగా, మాటలతో గానీ హింసించడం వంటివి చేయకూడదు. ఇతరులను అకారణంగా నిందించడం.. నల్ల దుస్తులు ధరించడం వంటివి చేయకూడదు. రాత్రి ఎక్కువ సమయం వరకూ మేలుకుని ఉండకూడదు.