
ధన, సంపదల అధిపతి అయిన కుబేర స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు కడితే చాలా మంచిదని తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టేటప్పుడు కుబేరుడి దిశను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యలూ తలెత్తవు. మరి కొత్త ఇల్లు కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? ఈశాన్యంలో మెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదు. అటా కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
అలాగే ఈ శాన్యంలో చెప్పులు, చెత్తను ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అలాగే ఈశాన్యంలో బాత్రూమ్‌ను సైతం నిర్మించకూడదు. ఈశాన్యంలో బాత్రూమ్ కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే డబ్బును ఉత్తరం దిశలో పెడితే ధనలాభం కలుగుతుంది. ఇంటిని మురికిగా ఉంచితే లక్ష్మీదేవి ఆ దరిదాపుల్లోకి కూడా రాదట. నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరగడంతో పాటు ధన, సంపదలు వృద్ధి చెందుతాయని పండితులు చెబుుతున్నారు.
