బ్రహ్మకమలం మొక్కను ఇంట్లో పెంచేందుకు ఎలాంటి నియమాలున్నాయి?

బ్రహ్మ కమలం మొక్కను ప్రస్తుతం ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. మరి ఇళ్లలో పెంచుకోవడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. బ్రహ్మ కమలం పుష్పాన్ని రాత్రి పువ్వుల రాణి అని కూడా పిలుస్తారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా మంచి జరుగుతుందని చెబుతారు. బ్రహ్మ కంటి నీటి చుక్క నుంచి పుష్పం పుట్టిందని చెబుతారు కాబట్టి ఈ పుష్పం తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అంతే స్వచ్ఛతను ఈ మొక్కను పెంచుకుంటున్న వారి ఇంట్లోనూ.. మనసుకి, ఇంటికి సానుకూలతను, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది.

ఈ మొక్క ఉన్న ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని.. ఎలాంటి పని అయినా చక్కగా జరుగుతుందని నమ్మకం. ఈ అరుదైన పువ్వులు ఆత్మను శుద్ధి చేసి అంతర్గత శాంతిని పెంపొందించే శక్తిని ఇస్తాయని నమ్మకం. వాస్తు ప్రకారం ఇంట్లో బ్రహ్మ కమలం మొక్కను ఇంటి కేంద్ర స్థానంలో పెంచుకోవాలి. ఇంటి కేంద్ర స్థానాన్ని బ్రహ్మ స్థానం అంటారు. కాబట్టి బ్రహ్మకమలాన్ని బ్రహ్మస్థానంలో నాటాలి. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. బ్రహ్మస్థానంలో ఈ మొక్కను పెట్టేందుకు సాధ్యం కాదంటే ఇంటి ఈశాన్య దిశలో పెంచుకోవచ్చు. ఈ దిశలో పెంచితే ఇంటికి సిరి సంపదలను పెంచుతుందట.

Share this post with your friends