దర్భగడ్డిలో ఏ ఏ గుణాలుంటాయి? ఎన్ని రోజల పాటు నిల్వ చేయవచ్చు?

దర్బగడ్డిని ఏ ఏ కార్యక్రమాల్లో ఎన్నింటిని వినియోగించాలి? ఉంగరం వేలికి ధరించడం వలన ఏం జరుగుతుంది? వంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం కదా.ఇప్పుడు దర్బగడ్డికి ఏ ఏ గుణాలు ఉంటాయో తెలుసుకుందాం. దర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద ధర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు. ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును.

దర్బగడ్డిని ఎన్ని రోజుల పాటు నిల్వ చేయవచ్చో తెలుసుకుందాం. దర్బగడ్డిని నిల్వ చేసుకోవడమనేది కోసే రోజును బట్టి ఉంటుంది. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును. పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును. శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వరుడు.

Share this post with your friends