రాజస్థాన్‌లో సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాలేంటంటే..

పుష్కర్‌లోని బ్రహ్మదేవుని ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఆలయ విశేషాలు.. అక్కడ మాత్రమే బ్రహ్మ కొలువై ఉండటానికి కారణంతో పాటు బ్రహ్మ వృద్ధుడిగా కనిపించడానికి కారణం కూడా తెలుసుకున్నాం. పుష్కర్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయని కూడా తెలుసుకున్నాం. వీటిలో ముఖ్యమైనవి మూడున్నాయి. అవి.. ఆప్తేశ్వర్, రంగ్‌జీ, ఏకలింగజీ దేవాలయాలు. రంగ్‌జీ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్తాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం వచ్చేసి ఏకలింగజీ దేవాలయం.

ఏకలింగజీ ఆలయ విశేషం ఏంటంటే.. ఇక్కడ శివుడు అన్ని ఆలయాల్లో మాదిరిగానే లింగ రూపంలో ఉంటాడు. కానీ ఆకారం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక్కడి శివలింగం నాలుగు పక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉంటుంది. ఇక ఇక్కడ కాక గోవిందాజీ ఆలయం కూడా ఉంటుంది. అలాగే నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్‌ దర్గా, అధాన్‌ దిన్‌ కా జూన్‌ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్‌ భవనం, జగదీష్‌ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్‌ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం వంటివి తప్పక దర్శించాల్సిన ప్రదేశాలు.

Share this post with your friends