నూతన సంవత్సరంలో అన్ని రాశులకు ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు నూతన సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025 మార్చి 30 నుంచి మొదలు కాబోతోంది. నూతన సంవత్సరంలో ఆదాయ, వ్యయ, రాజపూజ్యం, అవమానం అనేవి కొన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం పరంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య రాశుల వారికి బాగుంది. సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఇక రాజపూజ్యం, అవమానాల పరంగా కర్కాటక, కుంభం, మీన రాశుల వారికి బాగుంది. తుల రాశి వారికి రాజపూజ్యం, అవమానం సమానంగా ఉంది. ఇక ఇప్పుడు అన్ని రాశుల వారి ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఆదాయం 02 ఉండగా.. వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 05 ఉండగా, అవమానం 07గా ఉంది.

వృషభరాశి వారికి ఆదాయం 11 ఉండగా.. వ్యయం 05గా ఉంది. రాజపూజ్యం 01 ఉండగా, అవమానం 03.

మిథున రాశివారికి ఆదాయం 14 ఉండగా.. వ్యయం 02గా ఉంది. రాజపూజ్యం 04 ఉండగా, అవమానం 03గా ఉంది.

కర్కాటక రాశి వారికి ఆదాయం 08 ఉండగా.. వ్యయం 02గా ఉంది. రాజపూజ్యం 07 ఉండగా, అవమానం 03గా ఉంది.

సింహరాశివారికి ఆదాయం 11 ఉండగా.. వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 03 ఉండగా, అవమానం 06గా ఉంది.

కన్యరాశి వారికి ఆదాయం 14 ఉండగా.. వ్యయం 02గా ఉంది. రాజపూజ్యం 06 ఉండగా, అవమానం 06గా ఉంది.

తులరాశి వారికి ఆదాయం 11 ఉండగా.. వ్యయం 05గా ఉంది. రాజపూజ్యం 02 ఉండగా, అవమానం 02గా ఉంది.

వృశ్చిక రాశివారికి ఆదాయం 02 ఉండగా.. వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 05 ఉండగా, అవమానం 07గా ఉంది.

ధనస్సు రాశివారికి ఆదాయం 05 ఉండగా.. వ్యయం 05గా ఉంది. రాజపూజ్యం 01 ఉండగా, అవమానం 05గా ఉంది.

మకర రాశి వారికి ఆదాయం 08 ఉండగా.. వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 04 ఉండగా, అవమానం 05గా ఉంది.

కుంభ రాశివారికి ఆదాయం 08 ఉండగా.. వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 07 ఉండగా, అవమానం 05గా ఉంది.

మీనరాశివారికి ఆదాయం 05 ఉండగా.. వ్యయం 05గా ఉంది. రాజపూజ్యం 03 ఉండగా, అవమానం 01గా ఉంది.

https://x.com/BhakthiTVorg/status/1901578625943847163?t=lFOyPj5AOoj9Z-uPi4woEw&s=08

Share this post with your friends