మహాశివరాత్రి నాడు చేసే ఉపవాసం వల్ల ఉపయోగాలేంటి?

ఉపవాసం మనల్ని భగవంతుడికి దగ్గరగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సైతం ఉపయోగపడుతుంది. ఉపవాసం అనేది మనిషి నిశ్చలంగా ఉంచడంతో పాటు మనసుని శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా శివరాత్రి నాడు తప్పక హిందువులంతా ఉపవాసం చేసి.. జాగారం చేస్తారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో ఉపవాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మనసు, శరీరం స్థిరంగా ఉంటాయని నమ్మకం. అలాగే మనం చేసే ఉపవాసం.. ధ్యానం, మంత్రోచ్ఛారణలు ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గిస్తుందని నమ్మకం.

ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మన శరీరంలో జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం వలన జీర్థాశయం ఉత్తేజితమవడంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. మెదడు పనితీరు సైతం మెరుగుపడి ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుదని చెబుతారు. ఈ క్రమంలోనే మన శరీరంలోని ఇన్సులిన్ నియంత్రణ జరగడంతో పాటు రక్త పోటును సైతం క్రమబద్దం చేస్తుంది. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న వారికి ఉపవాసం ఉండటం వలన చాలా మంచిది. మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మొత్తానికి ఆధ్యాత్మికంగానూ.. శారీరకంగానూ ఉపవాసం చాలా మంచిది.

Share this post with your friends