స్వర్ణ భైరవుడు ఎవరు?

కాల భైరవుడి గురించి వినే ఉంటారు.. పాపాల భైరవుడి గురించి వినే ఉంటారు. మరి స్వర్ణ భైరవుడు ఎవరు? భైరవుడు అంటే శివుడని తెలుసు. శివుడి అంశే స్వర్ణ భైరవుడా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడు? ఈ కథనంలో తెలుసుకుందాం. భైరవుడిలో భ అంటే సృష్టి.. ర అంటే స్థితి.. వ అంటే లయం అని అర్థం. అంటే సృష్టి, స్థితి, లయ మూడింటినీ కలిగినవాడే భైరవుడు అని అర్థం. అలాగే భయంకరమైన ధ్వని కలిగిన వాడు భైరవుడు అని కూడా చెబుతారు. మన పాపాలు నశించిపోయేలా పెద్దగా చప్పుడు చేసేవాడు పాపాల భైరవుడని పేర్కొంటారు.

స్వర్ణ భైరవుడు ఎవరు?
స్వర్ణ భైరవుడు ఎవరు?

మరి స్వర్ణ భైరవుడి సంగతేంటి? అంటే.. స్వర్ణం అంటే బంగారం. స్వర్ణ భైరవుడు అంటే బంగారాన్ని ప్రసాదించేవాడు కాదు. ఇక్కడ స్వర్ణం అంటే విలువైనవని అర్థం. విలువైనవి ప్రసాదించేవాడే స్వర్ణ భైరవుడు. ఈ స్వర్ణ భైరవుడు.. అరుణాచల క్షేత్రంలో ఉన్నాడు. అరుణాచలంలో మూలవిరాట్ దర్శనానికి వెళుతున్న క్రమంలో కుడిచేతి పక్కన స్వర్ణ భైరవుడు ఉంటాడు. స్వర్ణ భైరవుడు మనకు స్వర్ణాన్ని ప్రసాదిస్తాడు. స్వర్ణం అంటే విలువైనవి అని అర్థం. అరుణాచల క్షేత్రానికి స్వర్ణ భైరవుడే క్షేత్రపాలకుడు. రాత్రి వేళ అరుణాచలేశ్వరుడి తలుపులు మూసివేసిన తర్వాత తాళాలను స్వర్ణభైరవుడి వద్దే ఉంచుతారు.

Share this post with your friends