వామ్మో.. ఈ అమ్మవారిని ఎన్ని కోట్లతో అలంకరించారో తెలిస్తే..

ఈ అమ్మవారు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయలకు పైగా కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కోట్ల రూపాయల కరెన్సీ నోట్ల నడుమ అమ్మవారు ధగధగా మెరిసిపపపోతోంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే ఈ అమ్మవారు హాట్ టాపిక్‌గా నిలిచారు. పాలమూరు పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని రూ. 6,66,66,666.66ల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అందుకు తగ్గట్టు నగదును సేకరించేందుకు దాతలను ఆశ్రయించారు. దాతల నుంచి వచ్చిన విరాళాలతో అమ్మవారిని అలంకరించారు. ఈ క్రమంలోనే ఒక్క పైసా, 5 పైసల నుంచి విరాళాలను సేకరించారు. ఇక అమ్మవారి అలంకరణకు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కళాకారులను రప్పించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల దర్శనానంతరం తిరిగి కరెన్సీ నోట్లను దాతలకు ఇచ్చేశారు.

Share this post with your friends