‘శాంతాకారం భుజగశయనం’.. అనే శ్లోకం వింటుంటాం.. దాని అర్థమేంటంటే..

శాంతాకారం భుజగశయనం – పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం – యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం – సర్వలోకైకనాథం

పై శ్లోకం అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శాంతాకారం: శాంతమే ఆకారమైనవాడు
భుజగశయనం: పాము పడగగా కలవాడు
పద్మనాభం: పద్మము నాభియందు కలవాడు
సురేశం: దేవతలకు ప్రభువైనవాడు
విశ్వాధారం: ప్రపంచమునకు ఆధారమైనవాడు
గగనసదృశం: ఆకాశముని పోలినవాడు
మేఘవర్ణం: నల్లని మబ్బువంటి రంగు కలవాడు
శుభాంగం: అందమైన శరీర అంగములు కలవాడు
లక్ష్మీకాంతం: లక్ష్మీదేవికి భర్త
కమలనయనం: తామరపువ్వు వంటి నేత్రములు కలవాడు
యోగిభిర్ధ్యానగమ్యం: యోగుల హృదయమునకు గమ్యమైనవాడు
వందే విష్ణుం: విష్ణువును నమస్కరిస్తున్నాను
భవభయహరం: పుట్టుక వలన కలుగు బాధల నుండి రక్షించువాడు
సర్వలోకైకనాథం: సర్వలోకాలకు ఆది నాధుడు

Share this post with your friends