మనల్ని ముఖ్యంగా వేధించేవి.. ఆర్థిక, అనారోగ్య సమస్యలు. వీటి నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతుంటాం. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు పరిష్కారం ఒకటుంది. అది చాలా సింపుల్ పరిష్కారం. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా చేసే పని ఏదైనా కూడా సత్ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం నిద్రపోయే సమయంలో దగ్గరలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇటీవలి కాలంలో అయితే పక్కాగా మన పక్కన సెల్‌ఫోన్ ఉంటుంది. అయితే నిద్రించేటప్పుడు రూపాయి కాయిన్‌ను దిండు కింద పెట్టుకుని పడుకోవాలట.
రూపాయి కాయిన్‌ను దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మన చుట్టూ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దూరమవుతుందట. అలాగే దుష్ట శక్తుల ప్రభావం ఏమున్నా కూడా పోతుందట. ఆర్థిక సమస్యలేమైనా ఉన్నా తొలగిపోతాయట. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందట. మొత్తానికి అన్ని రకాల సమస్యల నుంచి మనం రూపాయి కాయిన్‌ను దిండు కింద పెట్టుకుంటే బయటపడవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక ఆ తరువాత నాణేన్ని పారే నీటిలో వేయవచ్చని పండితులు చెబుతున్నారు.