రాబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాక్షాత్తు ఇష్కాన్ (ISKCON) వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాదుల వారిచే హైదరాబాద్, అబిడ్స్ లో స్థాపించబడిన శ్రీ శ్రీ రాధా మదనమోహన దేవాలయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Watch Sri Krishna Janmashtami 2024 Special Vlog : ISKCON Temple Abids, Hyderabad
సుమారు 50 ఏళ్ళు అవుతున్న రాధాకృష్ణుల విగ్రహాలు ఎంతో ప్రకాశవంతంగా… కొన్ని రోజుల క్రితమే చేసిన వాటిలా ఉంటాయి. రాధాకృష్ణులను పూజించడం వలన మన జీవితాల్లో శ్రేయస్సు, సామరస్యం మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. రాధా-కృష్ణులు కేవలం మతపరమైన దేవతలు కాదు.. ప్రేమ, ఆప్యాయత, స్నేహం, శాంతి, కరుణకు కూడా చిహ్నాలు. రాధాకృష్ణుల కటాక్షం ఉంటే మీ జీవితంలోని అడ్డంకులు తొలగి, మీ సవాళ్లను ఎదుర్కొని, పోరాడటానికి మీకు అంతర్గత శక్తి లభిస్తుంది.
వీడియో టైటిల్ చూసి మీరు అనుకుని ఉండొచ్చు ఇష్కాన్ (ISKCON) లో 24 గంటలు ఏంటా అని.. మనం ఎప్పుడూ వెళ్లినట్టు ఈ ఆలయానికి వెళ్లి శ్రీ రాధా కృష్ణులను దర్శనం చేసుకుని రావడం ఒక పద్ధతి. కానీ ఈ అబిడ్స్ ఇష్కాన్ (ISKCON) లో జరిగే గొప్ప భక్తి కార్యక్రమాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబందించిన మంచి ప్రసంగాలు వినాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఇక్కడ 24 గంటలు ఉండాల్సిందే అనిపించి, ఇష్కాన్ లో 24 గంటలు పాటు అక్కడే ఉండి మీ అందరి కోసం ఈ వీడియో చేశాము. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు క్లియర్ గా చూడండి.
భూలోక బృందావనం.. హైదరాబాద్ ఇష్కాన్ (ISKCON) లో 24 గంటలు : భక్తి టీవీ వ్లాగ్
సో ఇదీ శ్రీ కృష్ణ తత్వాన్ని, హరి నామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న ఇష్కాన్ (ISKCON) ఆలయం గురించి డిటైల్డ్ వ్లాగ్… మీరు కూడా మీ కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి… ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీసులను పొందండి. లోకాన్ని నడిపిస్తున్న జగన్నాథుని ఒక్కసారి దర్శించుకున్నా… జన్మజన్మల పుణ్యఫలితం దక్కుతుంది. ఈ వీడియోను లైక్ చేసి… మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.
☛ Google Maps Location : https://g.co/kgs/YkR63A6
☛ Bhakthi TV YouTube Subscribe : https://bit.ly/2PCyk5D