శ్రావణ మాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారు.. శ్రావణ మాసంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలని అందరు అనుకుంటారు… అలాంటి వారందరి కోసం హైదరాబాద్ మహా నగరం లో ఉండే ఎంతో మహిమాన్వితమైన, శక్తి స్వరూపమైన అయినా శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం..!
Watch Most Powerful Sri Nimishambhika Devi Temple Vlog
శ్రావణమాసం లో అమ్మవారి క్షేత్రాలన్నీ రద్దీ గా ఉంటాయి… కానీ ఈ ఆలయం 365 రోజులు రద్దీ గానే ఉంటుంది. ఈ ఆలయం లో అమ్మవారిని నమస్కరించుకుని ధ్వజ స్థంభం దగ్గర ఏదైనా మనసారా కోరుకుంటే అవి 21 రోజుల్లో తప్పకుండ నెరవేరతాయని భక్తుల నమ్మకం… ఒక్క సారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు భక్తులపై ఎల్లవేళలా ఉంటుందని భక్తుల నమ్మకం… కొన్ని లక్షలమంది భక్తుల జీవితాల్లో అమ్మవారు వెలుగులు నింపారని ఎవరిని అడిగిన చెబుతారు. హైదరాబాద్ బోడుప్పల్ లో ఉన్న ఈ నిషాంబిక దేవి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ సిటీ లో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా… తెలంగాణ లో ఇతర పట్టణాల నుండి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
మరిన్ని విషయాలు మా భక్తి టీవీ వ్లాగ్ ద్వారా తెలుసుకోండి. అమ్మలుగన్నమ్మ శక్తి స్వరూపిణి, భక్తుల పాలిటి కొంగుబంగారం శ్రీ మాత నిమిషంభిక దేవిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి..!
ఆలయం గురించి ఒక డిటైల్డ్ వ్లాగ్… ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.. మరిన్ని వ్లాగ్ ల కోసం మా భక్తి టీవీ వెబ్సైటును మరియు యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవ్వండి..!