ప్రపంచంలో ఎక్కడా లేని మహత్తర ఆలయం. విఘ్నాలు తొలిగించే గణనాధుడు… ఈ సృష్టికి మూలం అయినా శంకరుడు కలిసి ఒకే చోట స్వయంభూగా వెలసిన గొప్ప క్షేత్రం “శ్రీ లక్ష్మీగణపతి దేవస్థానం”. మెహదీపట్నం కి దగ్గరలో విజయ్ నగర్ కాలనీ లో ఈ ఆలయం ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ ఇక్కడ పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి మహిమలు గురించి మాత్రం భక్తులు ఎంతో గొప్పగా చెబుతుంటారు. స్వామివారి ఆరాధనలో, ఈ ఆలయంలో జరిగే అన్నదాన సేవలో తరించిన ఎంతో మంది భక్తులు నేడు దేశవిదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
Watch Hyderabad Vijaynagar Colony Sri Lakshmi Ganapathi Temple Vlog
ఈ ఆలయంలో ప్రతీ ఆదివారము ఇక్కడ అన్నదానం ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. “అన్నదానం చేస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం. అన్నదానం చేసిన వారి ఇంట్లో భగవంతుడే దీపం వెలిగిస్తాడని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు చెప్పారు. అలాగే “ఒక వ్యక్తికి ప్రాణదానం చేసిన ఫలితం.. అన్నదానం చేసిన వ్యక్తికి దక్కుతుంది” అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఈ ఆలయానికి మీరు ఇప్పటి వరుకు సందర్శించక పోయుంటే తప్పకుండ ఆదివారం రోజున ప్లాన్ చేసుకోండి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం గురించి మీరే స్వయంగా చూడొచ్చు.
శివుడితో కలిసి వినాయకుడు వెలసిన ఏకైక క్షేత్రం : భక్తి టీవీ వ్లాగ్
ఈ ఆలయం చరిత్ర, ఈ ఆలయం ప్రత్యేకత… ఇక్కడ ప్రతినిత్యం జరిగే పూజా వివరాలు, ఇక్కడున్న ఉప ఆలయాలుతో పాటు … ఇక్కడ స్వామివారి చుట్టూ ఒక నాగు పాము ప్రదక్షిణలు చేసిన సంఘటన… అలాగే అమ్మవారు నడయాడినట్టు భక్తులు చెప్పే మహిమాన్విత విశేషాలు గురించి… ఇక్కడ 1980 నుంచి నిర్విరామముగా జరుగుతున్న అన్నదానం గురించి ఈ వ్లాగ్లో డిటైల్డ్ గా ఉంది… ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూడండి.