శ్రావణమాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారు. శ్రావణమాసంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలని అందరు అనుకుంటారు. ఈ వారం మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్ నగరం లోనే ఎంతో మహిమాన్వితమైన, శక్తి స్వరూపమైన శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారి ఆలయం.
Watch Hyderabad Boduppal Sri Nimishambhika Devi Temple Vlog
శ్రావణమాసంలో అమ్మవారి క్షేత్రాలన్నీ రద్దీగా ఉంటాయి… కానీ ఈ ఆలయం 365 రోజులు రద్దీ గానే ఉంటుంది. కోరిన కోరికలు నెరవేర్చిన అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులతో అమ్మవారి క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం లో అమ్మవారిని నమస్కరించుకుని ధ్వజ స్థంభం దగ్గర ఏదైనా మనసారా కోరుకుంటే అవి 21 రోజుల్లో తప్పకుండ నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఒక్క సారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు భక్తులపై ఎల్లవేళలా ఉంటుందని భక్తుల నమ్మకం. కొన్ని లక్షలమంది భక్తుల జీవితాల్లో అమ్మవారు వెలుగులు నింపారని ఎవరిని అడిగిన చెబుతారు. హైదరాబాద్ బోడుప్పల్ లో ఉన్న ఈ నిషాంబిక దేవి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ సిటీ లో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా… తెలంగాణ లో ఇతర పట్టణాల నుండి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారు : భక్తి టీవీ వ్లాగ్
ఈ ఆలయం ధ్వజ స్థంభం దగ్గర మీ మనసులో ఏదైనా కోరుకుని అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే.. ఆ కోరిక 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో ఖచ్చితంగా నెరేవేరుతుందని భక్తుల నమ్మకం. ఎంతోమంది జీవితాల్లో జరగవు అనుకున్నవి కూడా, ఆఖరి నిమిషంలో ఒక మిరాకిల్ జరిగినట్టు జరిగాయి అని ఆలయం లో ఉన్నవారు చెబుతున్నారు. విద్య, వైద్య, వ్యాపారం, ఉద్యోగం సమస్య ఏదైనా అమ్మవారు పరిష్కారం చూపిస్తారు అని భక్తుల ఖచ్చితమైన నమ్మకం. భక్తులు అనుకున్నది నెరవేరిన తరువాత అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారు.
Watch Hyderabad Vijaynagar Colony Sri Lakshmi Ganapathi Temple Vlog
అమ్మలుగన్నమ్మ శక్తి స్వరూపిణి, భక్తుల పాలిటి కొంగుబంగారం శ్రీ మాత నిమిషంభిక అమ్మవారి ఆలయం గురించి ఒక డిటైల్డ్ వ్లాగ్… ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ కి షేర్ చేయండి. మరిన్నీ భక్తి విశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.