వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్.
సికింద్రాబాద్ భాగ్యనగర వాసులకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి చాలా సుపరిచితమైన పేరు సికింద్రాబాద్. ఇక్కడ ఉండే రైల్వే స్టేషన్ కారణంగా తెలుగు వారు ఎవరు హైదరాబాద్ వచ్చినా ఒక్కసారైనా సికింద్రాబాద్ లో అడుగు పెట్టె ఉంటారు. ఎప్పుడూ ప్రయాణికులతో, షాప్పింగ్స్ కి వచ్చే వారితో ఎంతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ లో అత్యంత మహిమాన్విత మైన, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన, భక్తులు ఏది అడిగినా ప్రసాదించే గణపతి స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో 200 ఏళ్ళ స్వయంభు గణపతి విగ్రహం రెండవ ప్రపంచ యుద్ధ సైనికులకు దొరికిందని స్థలపురాణం చెబుతోంది. భాగ్యనగర వాసులు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అని ఇష్టంగా పిలుచుకునే ఆలయ విశేషాలు తెలుసుకుందాం..!
Watch Harasiddhi Matha & Gad Kalika Mata Ujjain Shakthi Peeth Temples Vlog
ఈ ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే చాలా విశాలమైన మండపం మనకు కనిపిస్తుంది. ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్న గణేశుని తో పాటు శివ పరివారమంతా ఒకే మండపం కింద ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఒక్క ముడుపు కట్టి 21 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటివి మరెన్నో విషయాలు, ఈ ఆలయం చరిత్ర, స్వామి వారి అద్భుత మహిమలు, ఇక్కడ జరిగే నిత్య పూజలు, ముడుపు కడితే 21 రోజుల్లో ఎలాంటి బాధ నుండైనా విముక్తి కలిగించే స్వామి వారి ఘన చరిత్ర గురించి, ఉప ఆలయాల గురించి క్లియర్ గా ఈ వ్లాగ్ లో తెలియజేశాము. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూడండి.
Watch 200 Year Old Famous Secunderabad Ganesh Temple Vlog
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ను టాప్ చేయండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.