
ఇప్పటికే దేశంలో కొన్ని శని దేవుని ఆలయాల గురించి తెలుసుకున్నాం కదా. ఎలాంటి శని దోషాలున్నా ఈ ఆలయాలను దర్శించుకుంటే చాలు.. సమస్యలన్నీ ఎగిరిపోతాయి. ఈ క్రమంలోనే మరో రెండు శని దేవుని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరునల్లార్ శనిదేవుని ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉంది. రెండు నదుల మధ్య ఈ శనిదేవుని ఆలయం ఉంటుంది. ఇక్కడ శనితో పాటు శివుడు కూడా కొలువై ఉంటాడు. ఇక్కడ శనితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రాశులు మారుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అలా శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కర్ణాటకలోని తుమ్‌కూర్ జిల్లాలో ప్రసిద్ధ శని దేవాలయం ఉంది. ఇక్కడ శనిదేవుడు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ శని దేవుడు తన వాహనమైన కాకిపై కూర్చుని దర్శనమిస్తాడు. జాతకం ప్రకారం.. ఏలిన నాటి శని, అర్థాష్టమ శని వంటి శని దోషాలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శించి శని దేవుని పూజిస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ నమ్మకంతో శని దేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తుంటారు. జాతకం ప్రకారం ఏలినాటి శనితో, శనిదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాలలో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం.
