వినాయకుడి ఆకారం మనకు ముఖ్యంగా క్యారెట్, అల్లం వంటి వాటిలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా బొప్పాయి పండులో కనిపించింది. అది చూసి ఆ ఇంటి వారు షాక్ అయ్యారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట పాకడంతో స్థానికులంతా వచ్చి బొప్పాయి పండులోని వినాయకుడి ఆకారాన్ని దర్శించుకుంటున్నారు. బొప్పాయి పండులో తొండం రూపంలో వినాయకుడు కనిపిస్తున్నాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రి పేట గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నక్క పెంటమ్మ బొప్పాయి పండును కట్ చేయగా ఈ దృశ్యం కనిపించింది.
గణపతి నవరాత్రుల సమయంలో ఇలా వినాయకుడు దర్శనమివ్వడంతో ఆ ఇంటి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బొప్పాయి పండులో గణేశుని రూపం స్పష్టంగా కనిపించడంతో పెంటమ్మ ఇంటివారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాస్తవానికి పెంటమ్మ ఇంటిలోని బొప్పాయి చెట్టుకు కాసిన మొదటి కాయ కావడంతో దానిని తమ గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుడికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పెంటమ్మ దానిని ఇంటికి తీసుకెళ్లి తినేందుకని కట్ చేయగా బొప్పాయి పండులో తొండంతో విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు. గణపతిని చూసిన పెంటమ్మ షాకైంది. తమ గ్రామానికి సాక్షాత్తు వినాయకుడే వచ్చినట్టుగా భావించి తిరిగి మండపంలో పెట్టింది. ఈ వినాయకుడిని చూసేందుకు జనం పోటెత్తుతున్నారు.