తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని శనివారం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, సుపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘాట్ రోడ్లలోని ఆలయాల్లో…
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మొదటి ఘాట్ (డౌన్) రోడ్డులో ఉన్న వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇక నేడు శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు వచ్చింది.