పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. సిరిమాను రథోత్సవం నిన్న పెద్ద ఎత్తున జరిగింది. పైడి తల్లి అమ్మవారి పరివారంగా పిలిచే అంజలి రథం, పాలధార రథాలు, జాలరి వల సిరిమాను వెంట నడిచాయి. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమాను ఉత్సవమే ప్రధానమైనది. అమ్మవారి ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించారు. అలా సిరిమానును అదిరోహించిన ఆలయ ప్రధాన పూజారి అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చారు.
ప్రభుత్వం తరుఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. అమ్మవారి జాతరను వీక్షిస్తే సిరి సంపదలకు లోటుండదని భక్తుల విశ్వాసం. అమ్మవారి నామస్మరణతో విజయనగరం మారుమోగింది. పెదతాడివాడ నుంచి విజయనగరం వరకూ సిరిమానును తీసుకొచ్చారు. ఆ దారులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. సిరిమాను జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.