రేపు మహిళలంతా వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయినం ఇవ్వడం ఆనవాయితీ. ఇక ఈ వాయనాన్ని ఎవరి శక్తి మేరకు వారు ఇస్తుంటారు. అసలు వాయంలో ఏమేమి ఉండాలో చూద్దాం.
పసుప, కుంకుమ, తమలపాకులు. వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్ముక్క, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము తప్పనిసరిగా ఉండాలి. వాయనాన్ని 5 లేదా 9 లేదంటే11 మంది ముత్తైదువులకు ఇవ్వాలి. ముందుగా ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ పెట్టి, గంధం పూసి, పాదాలకు పసుపు రాయాలి. ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి. అనంతరం వాయనం అందించాలి. వాయనంలో తమలపాకు కాడలు ఇచ్చే వారి వైపు.. చివర్లు తీసుకునే వారి వైపు ఉండాలి. ఇక తరువాత వాయనం అందించాలి. ఆ తరువాత ప్రసాదాలను ముత్తైదువులకు అందించాలి.