ఇక్కడి వారాహి మాతే.. అక్కడ దండిని.. శ్రద్ధతో దీక్ష చేస్తే ఏం జరుగుతుందంటే..

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం వారాహి దీక్షను చేపట్టారు. ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి గురించి ప్రతి ఒక్కరిలోనూ చర్చ జరుగుతోంది. వారాహి మాత భూదేవి నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవత కాబట్టి అమ్మవారిని పూజిస్తే చాలు.. పంటలు సరిగా పండటమే కాకుండా వ్యవసాయం అనుకూలిస్తుందట. ప్రతి రైతు అమ్మవారిని ఆరాధించుకుంటే వ్యవసాయ పరమైన ఇబ్బందులేమీ తలెత్తవట. పైగా భూ సమస్యలు ఏమైనా ఉంటే తప్పక పరిష్కారమవుతాయట. అప్పుల బాధ నుంచి మనల్ని విముక్తుల్ని చేసి మనకు ఆర్థిక స్థిరత్వాన్ని ఈ అమ్మవారు ప్రసాదిస్తుందట.

ఈ అమ్మవారిని వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. వారాహి మాతను నేపాల్‌లో బరాహిగానూ.. రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఆమెను దండినిగానూ కొలుస్తారు.మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహి మాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా పరిగణిస్తారు. కాబట్టి అమ్మవారిని పూజించుకున్న వారికి అపజయమే ఉండదట. పైగా అన్ని విధాలుగా బాగా కలిసొస్తుందట. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించటం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు. పైగా ఈ అమ్మవారి దీక్షను ఎవరైనా ఆనందంగా నిర్వహించవచ్చట.

Share this post with your friends