తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిస్తున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చారు. ఒక్క తిరుమలే కాకుండా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. వైష్ణవాలయాలన్నింటిలో ఉత్తర ద్వారాన్ని ఓపెన్ చేయడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. భద్రాచలం ఆలయం సైతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాములవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు.

శ్రీతారామాచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు గోదావరి నదిలో శ్రీ సీతారామ చంద్రుల వారు, లక్ష్మణుడు, హనుమంతుడి సమేతంగా హంసవాహనంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. యాదగిరిగుట్టలో వాసుదేవుడి రూపంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. ఉదయం 5:30 గంటల నుంచే ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారు. ఇవాళ స్వామి వారికి గరుడు సేవోత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు. అలాగే ద్వారకా తిరుమలలోనూ చిన వెంకన్నను ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Share this post with your friends